ఛార్జీల విషయంలో కీలక ప్రకటన చేసిన పౌర విమానయాన మంత్రిత్వశాఖ

- July 29, 2020 , by Maagulf
ఛార్జీల విషయంలో కీలక ప్రకటన చేసిన పౌర విమానయాన మంత్రిత్వశాఖ

న్యూఢిల్లీ:వందే భారత్ మిషన్  5వ దశ.. ఆగస్ట్ 1 నుంచి ప్రారంభం అవుతోందన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సంబంధిత విమానయాన సంస్థలు విమాన టికెట్ విక్రయాలను ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు పౌర విమానయాన మంత్రిత్వశాఖ కీలక ప్రకటన చేసింది. వందే భారత్ మిషన్లో భాగంగా విమానాలను బుక్ చేసుకునేటప్పుడు ట్రావెల్ ఏజెంట్లకు ఎక్కువ ఛార్జీలు చెల్లించవద్దని సూచించింది. ఎయిర్ ఇండియా వెబ్‌సైట్‌లో అంతర్జాతీయ విమానాలకు సంబంధించిన ఛార్జీల వివరాలను పొందుపర్చినట్లు తెలిపింది. వెబ్‌సైట్‌లో పేరొన్న మేరకే.. ట్రావెల్ ఏజెంట్లుకు డబ్బులు చెల్లించాలని ప్రయాణికులకు స్పష్టం చేసింది. కాగా..గల్ఫ్, అమెరికా,సింగపూర్,ఫ్రాన్స్ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను భారత్కు తరలించడానికి ఐదో దశ వందే భారత్ మిషన్లో భాగంగా.. ఎయిర్ ఇండియా మంగళవారం రోజు టికెట్‌ల బుకింగ్‌ను ప్రారంభించింది.భారత్ లోని ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ, చెన్నై, కొచ్చి, బెంగళూరు,హైదరాబాద్,విజయవాడ సహా ప్రధాన నగరాల మధ్య ఆగస్టు 30 వరకు ఎయిర్ ఇండియా విమానాలను నడపనుంది.టికెట్ల ఛార్జీల వివరాల కొరకు ఈ క్రింద లింకు క్లిక్ చెయ్యగలరు.

http://www.airindia.in/images/pdf/VBM-FARES-FOR-WEBSITE-29-JUL-2020.pdf

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com