హర్మేనియన్‌ ట్రెయిన్‌ సర్వీసుల పునఃప్రారంభానికి కౌంట్‌డౌన్‌

- July 30, 2020 , by Maagulf
హర్మేనియన్‌ ట్రెయిన్‌ సర్వీసుల పునఃప్రారంభానికి కౌంట్‌డౌన్‌

జెడ్డా: హర్మేనియన్‌ హై స్పీడ్‌ ట్రెయిన్‌ సర్వీసు పునఃప్రారంభానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. మక్కా మరియు మదీనా మధ్య జెడ్డా మీదుగా అలాగే కింగ్‌ అబ్దుల్లా ఎకనమిక్‌ సిటీ ఆఫ్‌ రబిగ్‌ మీదుగా వెళ్ళే ఈ రైలు సర్వీసు సెప్టెంబర్‌ నుంచి మళ్ళీ అందుబాటులోకి రానుంది. ఈ ట్రెయిన్‌కి సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. అల్‌ హర్మేనియన్‌ రైల్వే వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ ప్రక్రియలో రిజర్వేషన్లు చేసుకోవచ్చు. గత డిసెంబర్‌లో ఈ రైలు సర్వీసుని నిలిపివేశారు. జెడ్డాలోని సులేమానియా స్టేషన్‌లో జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో దీన్ని ఆపేశారు. ఆ తర్వాత కరోనా వైరస్‌ నేపథ్యంలో సర్వీసుల్ని ఆపేయాల్సి వచ్చింది. సర్వీసు రద్దు సమయంలో ప్రత్యేక మెయిన్‌టెనెన్స్‌ చర్యలు చేపట్టారు. మక్కా - మదీనా మధ్య రోజూ 12 ట్రిప్‌లు నడిచేవి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com