కువైట్ వెళ్లే ఇండియన్లపై నిషేధం..ఇతర దేశాల మీదుగా వెళ్తే అనుమతి

- July 31, 2020 , by Maagulf
కువైట్ వెళ్లే ఇండియన్లపై నిషేధం..ఇతర దేశాల మీదుగా వెళ్తే అనుమతి

కువైట్ సిటీ:కరోనా కారణంగా ఇండియా నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో కువైట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియన్లు నేరుగా కువైట్ వెళ్లేందుకు అనుమతి లేదంటూనే ఇతర దేశాల మీదుగా వస్తే మాత్రం అభ్యంతరం లేదని ప్రకటించింది. ఈ మేరకు కువైట్ డీజీసీఏ ఓ స్టేట్మెంట్ విడుదల చేసింది. కరోనా కారణంగా ఏడు దేశాలు బంగ్లాదేశ్, ఫిలిప్పెన్స్, ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్, ఇరాన్, నేపాల్ నుంచి ఏ ఒక్క ప్రయాణికుడు నేరుగా కువైట్ వచ్చేందుకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే..ఆ 7 దేశాల ప్రయాణికులు కువైట్ వెళ్లాలని అనుకుంటే..ఇతర దేశాలకు(నిషేధం విధించిన 7 దేశాలు కాకుండా) వెళ్లి 14 రోజులు అక్కడ ఉన్న తర్వాత అక్కడి నుంచి నేరుగా కువైట్ వచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని వెల్లడించింది. అయితే..కువైట్ వచ్చే ముందు పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ ఖచ్చితంగా ఉండాలని సూచించింది. ఆగస్ట్ 1 నుంచి కువైట్ డీజీసీఏ వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభిస్తున్న నేపథ్యంలో కొత్త మార్గనిర్దేశకాలను విడుదల చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com