లైసెన్సు లేకుండా లీగల్‌ సర్వీస్‌: కంపెనీలపై కేసులు

- July 31, 2020 , by Maagulf
లైసెన్సు లేకుండా లీగల్‌ సర్వీస్‌: కంపెనీలపై కేసులు

మనామా:లైసెన్సులు లేకుండా లీగల్‌ సర్వీసులు అందిస్తున్న మూడు సంస్థలపై కేసులు నమోదయ్యాయి. ప్రాసిక్యూటర్‌ హుస్సేన్‌ అల్‌ బువైలి ఈ విషయాన్ని వెల్లడించారు. మినిస్ట్రీ ఆఫ్‌ జస్టిస్‌ అండ్‌ ఇస్లామిక్‌ ఎఫైర్స్‌ ఈ మేరకు ఆయా సంస్థలపై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారాయన. లీగల్‌ ఆఫీసులు, లాయర్లు మాత్రమే, లీగల్‌ కన్సల్టేషన్లు అలాగే లా ప్రాక్టీస్‌ చేయడానికి వీలుందని చెప్పారు. లైసెన్సు లేకుండా లీగల్‌ ఎయిడ్‌ అందిస్తున్నవారిపై ఖచ్చితమైన చర్యలు వుంటాయని ఈ సందర్భంగా ప్రాసిక్యూటర్‌ స్పష్టం చేశారు. నిందితులకు ఏడాది జైలు శిఖ, 1,000 బహ్రెయినీ దినార్లకు పైగా జరీమానా విధించే అవకాశముంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com