మస్కట్:హోం ఐసోలేషన్ గైడ్‌లైన్స్ విడుదల
- July 31, 2020
మస్కట్:మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, హోం ఐసోలేషన్ గైడ్ లైన్స్ విడుదల చేయడం జరిగింది. బాగా వెంటిలేషన్ వున్న సింగిల్ రూవ్‌ుకి అటాచ్ చేయబడిన టాయిలెట్ వుండాలి. హెల్త్ కేర్ ఇన్‌స్టిట్యూషన్‌ని సందర్శించాల్సి వచ్చినప్పుడు తప్ప, బయటకు రాకూడదు. కరోనా బాధితుడికి ఒక్కరు మాత్రమే సహాయకారిగా వుండాలి. అలా సాయపడే వ్యక్తి సర్జికల్ మాస్క్, డిస్పోజబుల్ గ్లవ్స్ కలిఇ వుండాలి. ప్రతిసారీ వీటిని మార్చుతూ వుండాలి. చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. ఐసోలేషన్ సమయంలో బాధితుడ్ని ఎవరూపరామర్శించకూడదు. రోజువారీ ఉపయోగించే వస్తువుల్ని కరోనా బాధితుడి కోసం ప్రత్యేకంగా వుంచాలి. బాధితుడు తన రూమ్ ని తానే శుభ్రం చేసుకోవాలి. టాయిలెట్‌ని కూడా తానే శుభ్రం చేసుకోవాల్సి వుంటుంది. కరోనా నిందితుడు ధరించే వస్త్రాల్ని ప్రత్యేకంగా శుభ్రపరచాల్సి వుంటుంది. హోం ఐసోలేషన్ 14 రోజులపాటు వుంటుంది. హెల్త్ కేర్ ప్రొవైడర్లు చెప్పేదాకా హోం ఐసోలేషన్ ముగిసినట్లు భావించకూడదు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







