ఏ.పి:మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం
- July 31, 2020
అమరావతి:వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేశారు.దీంతో పాటు సీఆర్డీయే రద్దు బిల్లును కూడా ఆమోదించారు. గవర్నర్ ఆమోదంతో ఏపీ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖ ఏర్పాటుకానుంది. శాశన రాజధానిగా అమరావతి, జ్యూడీషియల్ రాజధానిగా కర్నూలు ఉండబోతున్నాయి.
జనవరి 20వ తేదీన రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. శాసనమండలిలో ఈ బిల్లులు పాస్ కాలేదు. దీంతో, జూన్ 16న రెండోసారి ఈ రెండు బిల్లులకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. అనంతరం, ఈ బిల్లులను శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపింది.
ఈ నేపథ్యంలో, మూడు వారాల కింద ఈ బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఈ బిల్లులపై న్యాయశాఖ అధికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాత గవర్నర్ ఆమోదముద్ర వేశారు. గవర్నర్ ఆమోదంతో ఏపీకి మూడు రాజధానులు ఏర్పడనున్నాయి.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?