మస్కట్:ఈద్ పేరుతో సామూహిక కార్యక్రమాలు నిర్వహిస్తే భారీ జరిమానాలు

- July 31, 2020 , by Maagulf
మస్కట్:ఈద్ పేరుతో సామూహిక కార్యక్రమాలు నిర్వహిస్తే భారీ జరిమానాలు

మస్కట్:ఈద్ సందర్భంగా ఎవరైనా ఒకే చోట గుమికూడితే భారీగా జరిమానా చెల్లించాల్సి వస్తుందని రాయల్ ఒమన్ పోలీసులు హెచ్చరించారు. ఈద్ ను పురస్కరించుకొని ఎవరూ ఇతరులకు అహ్వానాలు పంపించొద్దని, అహ్వానాలు అందినా..ఎవరూ వెళ్లకూడదని కూడా పోలీసులు సూచించారు. ఒకవేళ తమ హెచ్చరికలను పెడచెవిన పెట్టి ఒకే దగ్గర గుమికూడితే భారీగా జరిమానా చెల్లించాల్సి వస్తుందన్నారు. సామూహిక కార్యక్రమాలకు హజరైన ఒక్కో వ్యక్తిపై 1500 ఒమనీ రియాల్స్ ఫైన్ విధిస్తామన్నారు. ఎంతమంది వ్యక్తులు ఉంటే అన్ని 1500 ఒమనీ రియాల్స్ ను అహ్వానించిన వ్యక్తి చెల్లించాల్సి ఉంటుంది. ఇక హజరైన వ్యక్తిపై విడిగా మరో 1000 ఓమనీ రియాల్స్ ఫైన్ విధిస్తామని రాయల్ ఒమనీ పోలీసులు హెచ్చరించారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com