తెలంగాణలో ఒక్క రోజులో 2 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు
- August 01, 2020
హైదరాబాద్:తెలంగాణలో గడచిన 24 గంటల్లో తొలిసారి ఒక్క రోజులో 2 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2,083 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 64,786 కు చేరింది. ఈ మేరకు శనివారం ఉదయం తెలంగాణ ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది.
గడచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 11 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 530కి చేరింది. తాజాగా వచ్చిన కేసుల్లో GHMC-578, రంగారెడ్డి-228, మేడ్చల్- 197, వరంగల్ అర్బన్-134, సంగారెడ్డి-101 కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకొని తాజాగా 1,114 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తంగా 46,502 మంది కోలుకోగా, 17,754 మంది చికిత్స పొందుతున్నారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







