అంచలంచెలుగా ఉన్నత స్థానానికి ఎదిగిన నాయకుడు మాణిక్యాలరావు:కృష్ణంరాజు
- August 01, 2020
హైదరాబాద్:బిజెపి నేత, ఏపీ మాజీ మంత్రి మాణిక్యాలరావు కరోనా మహమ్మారి వల్ల కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 60 సంవత్సరాలు. ఆయన నెల క్రితం కరోనా కారణంగా ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో నెల రోజులుగా విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం మృతి చెందారు. కరోనా కారణంగా మాజీ మంత్రి పి. మాణిక్యాలరావు మరణించారనే వార్త విని రెబల్ స్టార్ కృష్ణంరాజు దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. కరోనా కారణంగా ప్రముఖ రాజకీయ నాయకుడు మాజీ మంత్రి శ్రీ పి. మాణిక్యాలరావుగారు మరణించారనే వార్త తెలిసి చాలా బాధేసింది. పార్టీ పరంగానే కాకుండా ఆయనతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా మొదలై అంచలంచెలుగా ఉన్నత స్థానానికి ఎదిగిన నాయకుడు మాణిక్యాలరావు. భారతీయ జనతా పార్టీకి ఆయన చేసిన సేవను మరువలేం. ఆయన మరణవార్త వినగానే చాలా బాధేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను..’’ అని అన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?