గుణ 369కి ఏడాది
- August 02, 2020
కార్తీకేయ, అనఘా జంటగా నటించిన కమర్షియల్ రివేంజ్ డ్రామా విడుదలై నేటితో ఏడాది పూర్తయింది. ప్రవీణ కడియాల సమర్పణలో స్ప్రింట్ఫిలిమ్స్ ,జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. ఎస్జీ మూవీ మేకర్స్ పతాకంపై అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మించిన మొదటి చిత్రమిది. అర్జున్ జంధ్యాల ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అయ్యారు. ‘గుణ 369’ రిలీజై ఏడాది అయిన సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ మా సినిమా విడుదలై అప్పుడే ఏడాది అయిందా అన్నట్లుగా ఉంది. గతేడాది ఈ టైమ్‌లో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీవర్షాలు పడ్డాయి. అయినా మా సినిమా కొన్న బయ్యర్లు అంతా సేఫ్హ్యాండ్స్తో బయటపడ్డారు. హైదరాబాద్‌లో దిశ సంఘటన జరిగినప్పుడు మా సినిమాలోని క్లైమాక్స్ సీన్ ఫుల్‌గా వైరల్ అయింది. అది చూసిన తర్వాత మేము పడ్డ కష్టానికి తగిన ఫలితం లభించింది అనిపించింది. ఓటిటి ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ చిత్రం అక్కడకూడా పెద్ద విజయం సాధించటం ఆనందం కలిగించింది. ఈ సినిమా విజయంతో మాకు ఎంతో కాన్ఫిడెంట్ పెరిగింది. మార్చినెలలోనే మరో చిత్రాన్ని మా బ్యానర్‌పై ఎనౌన్స్ చేసేవాళ్లం. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల కారణంగా కొంచెం లేట్ అయింది. అర్జున్ జంద్యాల మాట్లాడుతూ–‘ నేను ఇంత మంచి సినిమా తీయటానికి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, మా హీరో కార్తికేయకు థ్యాంక్స్ చెప్తున్నా. దిశ సంఘటన జరిగినప్పుడు ప్రజలందరూ గుణ చిత్రంలోని క్లైమాక్స్ తరహాలోనే నేరస్తులకు శిక్షపడాలి అని కోరుకోవటం విన్నప్పుడు ఎమోషనల్‌గా ఫీలయ్యాను. మా చిత్రంలోని ‘బుజ్జిబంగారం..’పాట ఇప్పటికే అన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై 30మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. హీరో కార్తికేయ మాట్లాడుతూ– నేను నటించిన చిత్రాల్లో నా మనసుకు నచ్చిన చిత్రం ‘గుణ 369’ అన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?