తెలంగాణ:రాష్ట్ర కమిటీని ప్రకటించిన బండి సంజయ్
- August 02, 2020
హైదరాబాద్:తెలంగాణలో బలపడేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.గత లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో విజయం సాధించిన కాషాయ దళం అదే ఊపును కొనసాగించాలని వ్యూహాలు రచిస్తోంది. దీనిలో భాగంగానే కరీంనగర్ ఎంపీగా గెలుపొందిన బండి సంజయ్‌ను ఇప్పటికే నూతన అధ్యక్షుడిగా నియమించింది. అనంతరం రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని పటిష్టం చేయాలని భావించింది. ఈ క్రమంలోనే సంజయ్ తన కొత్త టీమ్‌ను నియమించారు. 8 మందిని పార్టీ ఉపాధ్యక్షులుగా, నలుగురిని ప్రధాన కర్యదర్శులుగా, మరో ఎనిమిది మందిని కార్యదర్శులుగా నియమించారు. ఈ మేరకు ఆదివారం బండి సంజయ్ నూతన కమిటీని ప్రకటించారు.
కమిటీ సభ్యుల వివరాలు:
నూతన రాష్ట్ర ఉపాధ్యక్షులు
1) డా. విజయ రామారావు (మాజీ ఎమ్మెల్యే)
2) చింతల రామచంద్రారెడ్డి (మాజీ ఎమ్మెల్యే)
3) సంకినేని వెంకటేశ్వరరావు (మాజీ ఎమ్మెల్యే)
4) యెండల లక్ష్మీ నారాయణ (మాజీ ఎమ్మెల్యే)
5) ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ (మాజీ ఎమ్మెల్యే)
6) యెన్నం శ్రీనివాస్ రెడ్డి (మాజీ ఎమ్మెల్యే)
7) మనోహర్ రెడ్డి
8) శోభారాణి
ప్రధాన కార్యదర్శులు
ప్రేమేందర్ రెడ్డి
ప్రదీప్ కుమార్
ఎమ్. శ్రీనివాసులు
కార్యదర్శులు
రఘునందన్ రావు
ప్రకాష్ రెడ్డి
శ్రీనివాస్ గౌడ్
బొమ్మ జయ శ్రీ
పల్లె గంగారెడ్డి
కుంజ సత్యవతి
మాధవి
ఉమరాణి
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







