చిరంజీవి బర్ట్‌డే స్పెషల్... మెగాస్టార్'స్ మెగా ర్యాప్!
- August 02, 2020
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు(ఆగస్టు 22) సందర్భంగా, ఆయన పుట్టినరోజు కంటే ముందు రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి ఓ స్పెషల్ సాంగ్ విడుదల చేయబోతోంది. మెగాస్టార్'స్ మెగా ర్యాప్ పేరుతో విడుదల కానున్న ఈ పాటను వెంకటాద్రి టాకీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు శివ చెర్రీ నిర్మించారు.
మెగాస్'స్ మెగా ర్యాప్ సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను శనివారం సాయంత్రం ఏడు గంటలకు విడుదల చేశారు. ఈ నెల 21న పాటను విడుదల చేయనున్నారు. విడుదలైన మరుసటి రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అని తెలిసిందే. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా శివ చెర్రీ నేతృత్వంలో విడుదలైన స్పెషల్ సాంగ్ పలువురు ప్రశంసలు అందుకుంది. సినిమా ప్రముఖులు ప్రత్యేకంగా పాట గురించి కొనియాడారు. మెగా ర్యాప్‌కు కూడా అటువంటి స్పందన వస్తుందని శివ చెర్రీ ఆశిస్తున్నారు.
ఈ పాటకు ఫ్రీక్ మాసన్ సంగీతం అందించారు. సురేంద్ర (స్కార్పియన్) ర్యాప్ ఆలపించారు. నిఖిల్ కాన్సెప్ట్స్ వీడియో కంపోజిషన్ చేసింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?