యూఏఈ వెళ్లే ప్రయాణికుల గైడ్ లైన్స్ లో స్వల్ప సవరణలు

- August 02, 2020 , by Maagulf
యూఏఈ వెళ్లే ప్రయాణికుల గైడ్ లైన్స్ లో స్వల్ప సవరణలు

యూఏఈ:పలు దేశాల నుంచి యూఏఈ ప్రయాణికులకు సంబంధించి గైడ్ లైన్స్ ను అప్ డేట్ చేసింది యూఏఈ పౌరవిమానయాన శాఖ. యూఏఈకి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా కోవిడ్ PCR టెస్ట్ పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. అయితే..ప్రయాణికులకు ఈ నిబంధనలో కొంత ఊరట కలిగిస్తూ వారి సొంత దేశంలోనే ప్రభుత్వం అనుమతించిన ఏదైనా ల్యాబ్ నుంచైనా PCR సర్టిఫికెట్ తీసుకొని రావొచ్చని వెల్లడించింది. అయితే..ఫ్లైట్ ప్రయాణానికి ఖచ్చితంగా 96 గంటలలోపుగా తీసుకున్న PCR టెస్ట్ రిజల్ట్స్ ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. PCR టెస్టులో నెగటివ్ వస్తేనే ఫ్లైట్ లోకి అనుమతి ఉంటుంది. ఇక 12 ఏళ్లలోపు చిన్నారులకు కోవిడ్ పరీక్షల నుంచి మినహాయింపు ఉంటుంది. ఇక యూఏఈలోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో దిగిన వెంటనే ప్రయాణికులందరూ మరోసారి PCR టెస్ట్ శాంపిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. రిజల్ట్స్ వచ్చే వరకు ఇళ్ల నుంచి వారు బయటికి రావటానికి వీల్లేదు. ఒకవేళ పాజిటివ్ వస్తే దుబాయ్ ఆరోగ్య శాఖ మార్గనిర్దేశకాల మేరకు ఐసోలేషన్ లో ఉండాల్సి ఉంటుంది. ఇదిలాఉంటే..యూఏఈకి వచ్చే ప్రయాణికులు, యూఏఈ నుంచి ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులు ఎమిరాతి ఎయిర్ లైన్స్ లో ప్రయాణిస్తే కోవిడ్ కవరేజ్ ఉచితంగా అందించనున్నట్లు యూఏఈ పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. ఎమిరాతి విమానాల్లో ప్రయాణిస్తూ కరోనా బారిన పడితే 1,50,000 యూరోల వరకు చికిత్స ఖర్చును ఎమిరాతి ఎయిర్ లైన్స్ భరిస్తుంది. అలాగే క్వారంటైన్ కాలానికి(14 రోజులు) రోజుకు 100 యూరోలు చెల్లిస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com