కేంద్ర మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్
- August 02, 2020
న్యూ ఢిల్లీ:కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తుంది. సామాన్యులతో పాటు చాలా మంది ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ వేదికగా తెలిపారు. తనకు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేపించుకున్నానని.. దీంతో పాజిటివ్ అని తేలిందని ట్విట్ చేశారు. వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. ఇటీవల కాలంలో తనతో సన్నిహితంగా ఉన్నవారంతా పరీక్షలు చేపించుకోవాలని.. సెల్ప్ ఐసోలేషన్‌లో ఉండాలని కోరారు.
బాల గంగాధర తిలక్ 100వ వర్థంతి సందర్భంగా శనివారం అమిత్ షా ఓ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి హాజరైన వారంతా సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండి, కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు.
తాజా వార్తలు
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం







