యూఏఈ నుంచి 275,000 మంది భారతీయులు స్వదేశానికి
- August 03, 2020
యూఏఈ:మే 7వ తేదీన రిపాట్రియేషన్ మొదలైనప్పటినుంచి ఇప్పటిదాకా యూఏఈ నుండి మొత్తంగా 275,000 మందికి పైగా భారతీయులు స్వదేశానికి వెళ్ళినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇండియన్ మిషన్ ఇన్ దుబాయ్ వెల్లడించిన వివరాల ప్రకారం 5,00,000 మంది భారతీయులు స్వదేశానికి వెళ్ళేందుకు రిజిస్టర్ చేసుకున్నారు. గత కొద్ది వారాలుగా కొందరు భారతీయులు స్వదేశానికి వెళ్ళాల్సిన సమయంలో చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటున్నారనీ, టిక్కెట్లు పొందే విషయంలో వారికి సమస్యలు తలెత్తుతున్నాయని కాన్సులేట్ పేర్కొంది. అయితే, ఇప్పటికీ ఎయిర్ ఇండియా అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాల్లో అవసరమైన సీట్లు ఖాళీగా వున్నాయని చెప్పారు. ఆగస్ట్ 15 వరకు 90 విమానాలు అందుబాటులో వున్నాయనీ, వీటి ద్వారా కేరళ, ఢిల్లీ, గయ, వారణాసి, అమ్రిత్సర్, జైపూర్, హైదరాబాద్, త్రిచీ, చెన్నయ్, ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, మంగళూరు మరియు లక్నో తదిర నగరాలకు వెళ్ళేందుకు వీలుందని కాన్సులేట్ పేర్కొంది. మార్చి 1తో వీసా గడువు ముగిసిన విజిటర్స్ ఆగస్ట్ 10వ తేదీ లోపు దేశం విడిచి వెళ్ళాలనీ సూచించింది ఇండియన్ మిషన్.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు