అబుధాబి:భారీ జాక్‌పాట్ గెలుచుకున్న భారతీయుడు
- August 03, 2020
అబుధాబి:యూఏఈలో ఉంటున్న ఓ పశ్చిమ బెంగాల్ వ్యక్తికి జాక్‌పాట్ తగిలింది. అబుధాబిలో నిర్వహించే ‘బిగ్ టిక్కెట్’ లాటరీలో ఆయన ఏకంగా 12 మిలియన్ దిర్హామ్స్ గెలచుకున్నారు. ఈ మేరకు లాటరీ విజేతను సోమవారం ప్రకటించారు. ‘బిగ్ టిక్కెట్’ తమ ఫేస్‌బుక్ ఖాతా ద్వారా కూడా విజేతకు శుభాకాంక్షలు తెలిపింది.
పశ్చిమ బెంగాల్ కు చెందిన దీపాంకర్ డే(37) దుబాయ్ లో ఆప్టోమెట్రిస్ట్ గా పనిచేస్తున్నాడు.అయన భార్య,కూతురు పశ్చిమ బెంగాల్లో నివసిస్తున్నారు.ఈ బిగ్ టిక్కెట్ మిలయనీర్ డ్రాను సోమవారం అబుధాబి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో తీశారు. 2018 నుంచి బిగ్‌టికెట్ ర్యాఫిల్లో 11 మంది స్నేహితులం కలిసి లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నామని, ఎప్పుడో ఒకసారి తాము లాటరీ గెలిచి తీరుతామని నమ్మేవాళ్లమని దీపాంకర్ డే అన్నాడు. అది ఈ రోజు నిజమైందని ఆనందం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం గెలిచిన ఈ భారీ మొత్తాన్ని అందరం సమానంగా పంచుకుంటామన్నాడు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?