ఏపీలో కరోనా విజృంభణ..

- August 03, 2020 , by Maagulf
ఏపీలో కరోనా విజృంభణ..

అమరావతి:ఏ.పీ‌లో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది..గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రవ్యాప్తంగా 45,516 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. 7,822 కేసులు పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యాయి.. ఇక‌, ఇదే స‌మ‌యంలో క‌రోనాబారిన‌ప‌డిన 68 మంది మృతిచెందారు.. దీంతో.. ఏపీలో న‌మోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,66,586కు చేరుకోగా.. 85,777 మంది క‌రోనాబారిన‌ప‌డి కోలుకున్నారు.. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 76,377 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు 1537 మందిని క‌రోనా బ‌లితీసుకుంది. 

గ‌త 24 గంట‌ల్లో అత్య‌ధికంగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో 11 మంది మృతిచెంద‌గా.. విశాఖ‌లో 9, ప్ర‌కాశం జిల్లాలో 8, నెల్లూరు, శ్రీ‌కాకుళంలో ఏడుగురు చొప్పున‌, విజ‌య‌న‌గ‌రంలో న‌లుగురు, చిత్తూరు, క‌ర్నూలు, కృష్ణా జిల్లాల్లో ముగ్గురు చొప్పున‌,  అనంత‌పురం, తూర్పు గోదావ‌రి, గుంటూరు, క‌డ‌ప జిల్లాల్లో ఇద్ద‌రు చొప్పున మృతిచెందారు. ఇక పాజిటివ్ కేసుల విష‌యానికి వ‌స్తే.. తూర్పుగోదావ‌రిలో 1113, విశాఖ‌లో 1049, అనంత‌పురంలో 953, విజ‌య‌న‌గ‌రంలో 677, క‌ర్నూలులో 602, క‌డ‌పలో 576, గుంటూరులో 573, నెల్లూరులో 500 కేసులు ఇవాళ అత్య‌ధికంగా న‌మోదు అయ్యాయి. 

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com