ఆరుగురు వ్యక్తుల్ని రక్షించిన కోస్ట్‌ గార్డ్‌

- August 04, 2020 , by Maagulf
ఆరుగురు వ్యక్తుల్ని రక్షించిన కోస్ట్‌ గార్డ్‌

మనామా: కోస్ట్‌ గార్డ్‌ కమాండర్‌ వెల్లడించిన వివరాల  ప్రకారం, ఓ బోటు మునిగిపోవడంతో అందులోని ఆరుగురు వ్యక్తులు సముద్రంలోకి జారిపోతుండగా వారిని కోస్ట్‌ గార్డ్‌ రక్షించడం జరిగింది. సెక్యూరిటీ చెక్‌ పాయింట్‌కి ఈ ఘటనపై సమాచారం అందగానే, వెంటనే సంఘటనా స్థలానికి సిబ్బంది చేరుకున్నారు. ఆ బోటుని సురక్షితంగా బయటకు లాగారు. సముద్రంలో బోట్లపై ప్రయాణించేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ, ఆటోమేటిక్‌ ఐడెంటిపికేషన్‌ డివైజ్‌ సరిగా వుండేలా చూసుకోవాలని, అత్యవసర సమయాల్లో 17700000 నంబర్‌ లేదా హాట్‌లైన్‌ 994కి ఫోన్‌ చేయాలని కోస్ట్‌ గార్డ్‌ కమాండర్‌ సూచించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com