కాంట్రాక్టు లపై ట్రంప్ కీలక నిర్ణయం..
- August 04, 2020
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఫెడరల్ కాంట్రాక్టుల్లో ఖచ్చితంగా అమెరికన్స్ ఉండాలన్న లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం కూడా చేశారు. ఈ నిబంధనలతో ఫెడరల్ కాంట్రాక్టులు పొందిన సంస్థలు అమెరికన్లను తీసుకోవాల్సి ఉంటుంది. కానీ చాలా సంస్థలు తక్కువ వేతనాలకు వస్తున్నారని అమెరికన్స్ ను కాదని.. H1B వీసాదారులను తీసుకుంటున్నారు. వీటిని అడ్డుకుని అమెరికన్స్ ను ఉద్యోగులు కల్పించాలన్న లక్ష్యంతో నిర్ణయం తీసుకున్నారు. అన్ని ఫెడరల్ సంస్థలు ఆడిట్ నిర్వహించి ఇతర దేశాలకు చెందిన ఉద్యోగులు ఎంతమంది ఉన్నారో తెలియజేయాలని ఆదేశించింది. వారిని తొలిగించి వెంటనే అమెరికన్స్ ను నియమించేలా నిబంధనలు సవరించాలని అమెరికా స్పష్టం చేసింది. ప్రభుత్వ రంగ సంస్థ టెన్నెసీ వ్యాలీ అథారిటీ సంస్థ ఇటీవల ఓ నివేదిక ఇచ్చింది. కంపెనీ ఇచ్చిన కాంట్రాక్టుల్లో 20శాతం ఉద్యోగులు విదేశాలకు చెందినవారే ఉన్నారంటోంది. కేప్ జెమినీ, అసెంచుర్, CGI కంపెనీలకు కాంట్రాక్ట్ లు అప్పగిస్తే విదేశాల నుంచి నిపుణులను రప్పించినట్టు తెలిపింది. అమెరికాలో జాబ్స్ అన్నీ ఇతర దేశాలు నిపుణులు ఎగరేసుకపోవడం వల్ల నిరుద్యోగం పెరుగుతుందని.. ఆందోళనగా ఉంది అగ్రరాజ్యం. అందుకే తాజా నిర్ణయం తీసుకుంది. ఫెడరల్ కాంట్రాక్టుల్లో ఖచ్చితంగా అమెరికన్స్ ఉండాలని నిబంధన విధించింది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







