విమానాల రాకపై నిషేధం..రాజకీయ ఉద్దేశ్యం కాదు

- August 04, 2020 , by Maagulf
విమానాల రాకపై నిషేధం..రాజకీయ ఉద్దేశ్యం కాదు

కువైట్: కొన్ని దేశాల నుండి విమానాలను నిషేధించడం అనేది ప్రస్తుత కరోనా మహమ్మారి దృష్ట్యా తీసుకున్న నిర్ణయమేకానీ, రాజకీయపరమైన సంబంధం లేదని కువైట్ ప్రభుత్వం ప్రకటించింది.ఈ నిషేధం శాశ్వతం కాదనీ తదుపరి నోటీసు వరకు అమలు చేయబడుతుంది అని తెలిపారు.

ఈ నిషేధం వల్ల దౌత్య సంబంధాలు ప్రభావితం కాదని వర్గాలు హామీ ఇచ్చాయి; ఇతర దేశాలతో కువైట్ కు ఉన్న సత్సంబంధాల వలన మరియు దేశాలతో ఒక అవగాహన ఉన్నందున, కువైట్ తీసుకున్న నిర్ణయాలను ఇతర దేశాలు అర్థం చేసుకుంటాయి అని ఆశాభావం వ్యక్తం చేసారు అధికారులు.

కువైట్‌లో కరోనా వ్యాప్తి ని నియంత్రించి క్రమంగా సాధారణ జీవితానికి తిరిగి ప్రారంభించే ముఖ్య ఉద్దేశ్యంతో చేపట్టిన ఈ నిషేధిత దేశాల జాబితాను ప్రకటించటం జరిగింది. క్రమేణా పరిస్థితులు చెక్కబడిన అనంతరం ఆరోగ్య అధికారుల సూచన మేరకు నవీకరించిన నిషేధిత దేశాల జాబితాను విడుదల చేస్తామని ధృవీకరించింది ప్రభుత్వం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com