డ్రిఫ్టింగ్‌: వలసదారుడి అరెస్ట్‌

- August 04, 2020 , by Maagulf
డ్రిఫ్టింగ్‌: వలసదారుడి అరెస్ట్‌

మస్కట్‌: ఆసియా కమ్యూనిటీకి చెందిన ఓ వలసదారుడ్ని పోలీసులు ‘డ్రిఫ్టింగ్‌’ ఆరోపణలపై అరెస్ట్‌ చేశారు. మస్కట్‌ గవర్నరేట్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. మస్కట్‌ గవర్నరేట్‌ పోలీస్‌ కమాండ్‌, నిందితుడ్ని అరెస్ట్‌ చేసినట్లు పేర్కొంది. సోషల్‌ మీడియాలో కన్పించిన ఓ వీడియో ఆధారంగా నిందితుడ్ని అరెస్ట్‌ చేసినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొన్నారు. యితి జిల్లాలోని బీచ్‌ రోడ్డులో నిందితుడు డ్రిఫ్టింగ్‌కి పాల్పడ్డాడు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com