డబ్బుని తిరిగిచ్చిన బహ్రెయినీకి సన్మానం
- August 04, 2020
బహ్రెయిన్: నార్తరన్ గవర్నర్ అలి బిన్ అల్ షేక్ అబ్దుల్ హుస్సేన్ అల్ అస్ఫౌర్, హాసన్ మొహమ్మద్ అల్ అస్వాద్ అనే బహ్రెయినీ వ్యక్తిని సన్మానించారు. ఆటోమేటిక్ క్యాష్ డిపాజిట్ మెషీన్లో వేరే వ్యక్తికి చెందిన సొమ్ముని గుర్తించిన అల్ అస్వాద్, సమీపంలోని పోలీస్ స్టేషన్లో అప్పగించేశారు. ఈ సందర్భంగా నార్తరన్ గవర్నర్, అల్ అస్వాద్కి కృతజ్ఞతలు తెలిపింది. మంచి పౌరుడిగా ఎలా వుండాలో అల్ అస్వాద్ నిరూపించాడని పోలీసు అధికారులు పేర్కొన్నారు. అల్ అస్వాద్కి పోలీసు అధికారులు సన్మానం ఏర్పాటు చేయగా, ఈ కార్యక్రమానికి డిప్యూటీ నార్తరన్ గవర్నర్ బ్రిగేడియర్ ఖాలెద్ బిన్ రబియా సినాన్ అల్ దోస్సారి, నార్తరన్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ జనరల్ బ్రిగేడియర్ ఇస్సా బిన్ హస్సాన్ అల్ కత్తాన్, ఇన్స్టిట్యూషనల్ రిలేషన్స్ హెడ్ హిషావ్ు అబు అల్ ఫాత్, ఎన్బిబి మనీ ట్రాన్స్ఫర్స్ అండ్ క్యాష& డిపాజిట్ మెషీన్స్ డైరెక్టర& మొహమ్మద్ అల్ సఫ్పాÛర్ తదితరులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







