ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ
- August 04, 2020
అమరావతి:ఏపీలో మూడు రాజధానుల బిల్లుపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మూడు రాజధానులు, crda రద్దు బిల్లులను వ్యతిరేకిస్తూ రైతులు దాఖలు చేసిన పిటిషన్లను ఈ రోజు ఏపీ హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దీనిపై ఈ నెల 14 వరకూ రాజధానుల బిల్లుపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ ఈ నెల 14 కు వాయిదా వేసింది హైకోర్టు.
కౌంటర్ దాఖలు పది రోజుల సమయం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోర్టును కోరింది. దీంతో కౌంటర్ దాఖలు చేయడానికి పదిరోజుల సమయం ఇచ్చింది హైకోర్టు. కాగా బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. పిటిషన్ల తరపున శ్యామ్ దివాన్, ఉన్నవ మురళీధర్ వాదనలు వినిపించారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం







