ఏ.పీలో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు
- August 04, 2020
అమరావతి:ఏ.పీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.. పాజిటివ్ కేసులు నిన్న తగ్గినా మళ్ళీ . భారీగానే కొత్త కేసులు నమోదు అయ్యాయి.. మరోవైపు మృతుల సంఖ్య భయపెడుతోంది.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 9,747 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి.. ఇక, ఇదే సమయంలో కరోనా బారిన పడిన 67 మంది మృతిచెందారు.. దీంతో.. ఏపీలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,76,333కు చేరుకోగా.. 95,625 మంది కరోనాబారినపడి కోలుకున్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 79104 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు 1,604 మందిని కరోనా బలితీసుకుంది. గత 24 గంటల్లో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 12, కృష్ణా జిల్లాలో 9, కర్నూలు జిల్లాలో 8, తూర్పు గోదావరి-చిత్తూరు-నెల్లూరు జిల్లాల్లో ఏడుగురు చొప్పున, అనంతపురం-శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు చొప్పున, విశాఖలో రెండు, విజయనగరం-పశ్చిమ గోదావరి-ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్







