శర్వానంద్‌తో సినిమా ప్లాన్ చేస్తున్న శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి
- August 04, 2020
హైదరాబాద్:ఇటీవల హీరో నిఖిల్ 20వ సినిమాని నిర్మించనున్నట్లు శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి (ఏషియన్ గ్రూప్ యూనిట్) ప్రకటించింది. తాజాగా, హీరో శర్వానంద్‌తో ఓ సినిమా నిర్మించనున్నట్లు నిర్మాతలు నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు తెలిపారు.
త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన డైరెక్టర్, తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించనున్నారు.ఒకదాని తర్వాత ఒకటిగా చిత్రాలు నిర్మించేందుకు శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి ప్లాన్ చేస్తోంది.
శర్వానంద్ ప్రస్తుతం 'శ్రీకారం' చిత్రంతో పాటు ఒక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రాన్ని ఏక కాలంలో చేస్తున్నారు.మరోవైపు నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరి' అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను ఏషియన్ సినిమాస్ నిర్మిస్తోంది. దీని షూటింగ్ ముగింపు దశలో ఉంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?