యూఏఈ, కువైట్, బహ్రెయిన్‌లతో బోర్డర్‌ని తెరిచిన సౌదీ అరేబియా
- August 05, 2020
జెడ్డా: సౌదీ అరేబియా తమ ల్యాండ్ బోర్డర్లను తెరిచింది. యూఏఈ, కువైట్ మరియు బహ్రెయిన్‌లతో బోర్డర్స్‌ని పంచుకుంటోన్న సౌదీ అరేబియా, ల్యాండ్ బోర్డర్లను తెరుస్తున్నట్లు ప్రకటించింది. ఎకనమిక్ యాక్టివిటీని తిరిగి సాధారణ స్థాయికి తెచ్చే క్రమంలో ఈ చర్యలు చేపట్టారు. కింగ్డవ్ులోకి గూడ్స్‌ని తీసుకొచ్చే కమర్షియల్ ట్రక్కులు ల్యాండ్ పోర్టుల ద్వారా సౌదీలోకి ప్రవేశించవచ్చు. ఈ మేరకు సౌదీ కస్టమ్స్ ఓ సర్క్యులర్ జారీ చేసింది. మార్చి 7న కరోనా వైరస్ నేపథ్యంలో బోర్డర్స్‌ని మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. కాగా, సరిహద్దుల్లో కరోనా వైరస్‌కి సంబంధించి ప్రికాష్స్ అన్నీ తీసుకుంటున్నారు. ఇదిలా వుంటే, మంగళవారం సౌదీ అరేబియాలో 1,342 కొత్త కరోనా పాజిటివ్ కేసుల్ని గుర్తించారు. ఇప్పటిదాకా మొత్తం 281,435 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2,954 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?