అయోధ్య రామ మందిరం: ముగిసిన భూమి పూజా కార్యక్రమం
- August 05, 2020_1596614246.jpg)
అయోధ్యలో రామ మందిరానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం పూర్తయింది.
ప్రధాని మోదీ, ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సహా ముఖ్య అతిథులందరూ భౌతిక దూరం పాటిస్తూ ఈ పూజలో కూర్చున్నారు.
అంతకుముందు ఆయన అయోధ్య చేరుకున్న వెంటనే స్థానికంగా ఉన్న హనుమాన్ గర్హీ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం రామ జన్మభూమి స్థలానికి చేరుకుని రామ్‌లల్లా విగ్రహం ఎదుట సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ తర్వాత హారతి ఇచ్చి, ప్రదక్షిణం చేశారు. అక్కడ పారిజాత మొక్కను నాటారు.
ప్రధాని మోదీ చేతుల మీదుగా సరిగ్గా ముహూర్త సమయానికే పండితులు భూమి పూజ క్రతువును చేయించారు. ఈ క్రతువు ముగియగానే ప్రధాని మోదీ పునాది నుంచి కుంకుమ తీసుకొని నుదుట ధరించారు. దీంతో అక్కడే వున్న ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్‌తో పాటు అతిథులు గట్టిగా కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ప్రధాని మోదీ పునాది వేసిన ప్రాంతానికి శిరస్సు వంచి నమస్కరించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?