ఆర్‌పి స్టిక్కర్ సర్వీస్: ఎన్‌పిఆర్‌ఎ ముహరాక్ కార్యాలయం ప్రారంభం
- August 06, 2020
బహ్రెయిన్: నేషనాలిటీ పాస్‌పోర్ట్స్ అండ్ రెసిడెన్స్ ఎఫైర్స్ (ఎన్‌పిఆర్‌ఎ), ముహరాక్ సెక్యూరిటీ కాంప్లెక్స్‌లో తమ కార్యాలయ పునఃప్రారంభంపై ప్రకటన చేసింది. ఆదివారం ఈ కార్యాలయం ప్రారంభమవుతుందనీ, రెసిడెన్సీ స్టిక్కర్ సర్వీస్ కోసం మాత్రమే ఈ కార్యాలయాన్ని పునఃప్రారంభిస్తున్నామని పేర్కొంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యాలయం తెరిచి వుంటుంది. కరోనా వైరస్ నేపథ్యంలో సోషల్ డిస్టెన్సింగ్ సహా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందుగా స్కిప్లినో మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న అపాయింట్‌మెంట్లను బట్టి ఖాతాదారులకు అవకాశం కల్పిస్తారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?