31 దేశాల ప్రయాణికులపై నిషేధాన్ని ప్రతి 10 రోజులకు సమీక్షించనున్న కువైట్

- August 06, 2020 , by Maagulf
31 దేశాల ప్రయాణికులపై నిషేధాన్ని ప్రతి 10 రోజులకు సమీక్షించనున్న కువైట్

కువైట్ సిటీ:కరోనా ప్రభావంతో 31 దేశాల ప్రయాణిలపై నిషేధం విధించిన కువైట్ ప్రభుత్వం..తమ నిషేధ నిర్ణయంపై ప్రతి 10 రోజులకు ఓ సారి సమీక్షిస్తామని వెల్లడించింది. ఆయా దేశాల్లో కరోనా తీవ్రత, అక్కడి ప్రభుత్వాలు చేపడుతున్న చర్యల ఆధారంగా అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ, ఇతర అంతర్జాతీయ సంస్థలు ఇచ్చే నివేదికలను బట్టి నిషేధం సడిలింపులపై నిర్ణయం తీసుకోనున్నారు. అంతర్జాతీయ సంస్థల నివేదిక ఆధారంగా నిషేధం విధించిన 31 దేశాల జాబితాను పెంచనూ వచ్చు..లేదంటే తగ్గించనూ వచ్చని కువైట్ వెల్లడించింది. అయితే..ఏయే దేశాల నుంచి ప్రయాణికులను అనుమతించాలనేది నిర్ణయించేందుకు ఓ యంత్రగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. జడ్జిలు, డాక్టర్లు, నర్సులు, టీచర్లకు ప్రధాన్యత ఉంటుంది. ఇదిలాఉంటే..కువైట్ నుంచి భారత్ కు వెళ్లే ప్రయాణికులు అనుమతి ఇచ్చేలా ఇరుదేశాల మధ్య ఓ ఒప్పందం కుదిరినట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించారు. ఈ మేరకు రోజు వెయ్యి మంది ప్రయాణికులు కువైట్ నుంచి భారత్ కు ప్రయాణించొచ్చు. అయితే..ప్రస్తుత నిబంధనల ప్రకారం మాత్రం కువైట్-భారత్ మధ్య విమాన ప్రయాణంపై నిషేధం అమలులో ఉంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com