బీరుట్ కు సౌదీ సాయం..సహాయసామాగ్రితో లెబనాన్ వెళ్లిన విమానం
- August 07, 2020రియాద్:భారీ పేలుడుతో అల్లకల్లోలంగా మారిన లెబనాన్ రాజధాని బీరుట్ ప్రజలకు చేదోడుగా నిలిచింది సౌదీ ప్రభుత్వం. కింగ్ సల్మాన్ మనవతాదృక్ఫథం సహాయ కేంద్రం నుంచి బీరుట్ ప్రజలకు అవసరమైన సహాయ సామాగ్రితో తొలి విమానం లెబనాన్ కు బయల్దేరింది. భారీ పేలుడు బాధితులకు మానవీయకోణంలో ఆదుకోవటం కోసం అవసరమైన మెడిసిన్, అహారాన్ని సౌదీ ప్రభుత్వం సాయంగా అందిస్తోంది. గత మంగళవారం బీరుట్ పోర్టులో భారీ పేలుడు సంభవించటంతో దాదాపు 135కి మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 4 వేల మందికిపై గాయపడ్డారు. కొందరు ఇళ్లు నేలమట్టమై రోడ్డునపడ్డారు. ఈ పరిస్థితుల్లో బాధితులకు చేదోడుగా నిలవాలని భావించిన సౌదీ ప్రభుత్వం దాదాపు 120 టన్నుల మెడిసిన్స్, వైద్య పరికరాలు, అత్యవసరంగా ఉపయోగపడే సామాగ్రి, అహారం, టెంట్లు, షెల్టర్ కిట్స్ విమానాల ద్వారా తరలిస్తోంది. వీటిని బాధితులకు అందించేందుకు ప్రత్యేకంగా ఓ టీంను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ