ఖతార్ కు NRIల తిరుగు ప్రయాణంపై కసరత్తు..భారత రాయబార కార్యాలయం ప్రకటన
- August 07, 2020
దోహా:ఇండియా నుంచి ఖతార్ తిరిగి వెళ్లాలనుకుంటున్న ప్రవాసభారతీయులకు సంబంధించి తాము తగిన కసరత్తు చేస్తున్నామని ఖతార్ లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. సరైన రెసిడెన్సీ పర్మిట్ ఉండి ఖతార్ తిరుగు ప్రయాణం చేయాలనుకుంటున్నవారు తమ సూచనలు ఎప్పటికప్పుడు గమనించాలని కోరింది. దీనికి సంబంధించి ఎలాంటి సమాచారాన్ని అయినా తమ అధికారిక సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తామని కూడా వెల్లడించింది. ఖతార్ తిరుగు ప్రయాణం అయ్యే భారతీయులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా ప్రయాణం చేసేలా తాము కసరత్తు చేస్తున్నామని వివరించింది. అయితే..తమ సూచనలు అందేవరకు ఎవరూ ముందస్తుగా విమాన టికెట్లను బుక్ చేసుకోవద్దని కూడా హెచ్చరించింది. కొన్ని సంస్థలు, ఏజెంట్లు సోషల్ మీడియా వేదికగా ఖతార్ ప్రయాణానికి టికెట్లు అమ్మకాలు జరుపుతున్నారని..ప్రస్తుతానికి ఖతార్-భారత్ మధ్య రెగ్యూలర్ విమాన సర్వీసులు నడవటం లేదన్న విషయాన్ని గమనించాలని రాయబార కార్యాలయం కోరింది. అయితే..కొన్ని ప్రత్యేక అనుమతులపై ఆరోగ్య రంగ ఉద్యోగులు, అత్యవసర సర్వీసు ఉద్యోగులు ఛార్టెడ్ విమానాల ద్వారా ప్రయాణిస్తున్నారని వెల్లడించింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







