బీరుట్ కు సౌదీ సాయం..సహాయసామాగ్రితో లెబనాన్ వెళ్లిన విమానం

- August 07, 2020 , by Maagulf
బీరుట్ కు సౌదీ సాయం..సహాయసామాగ్రితో లెబనాన్ వెళ్లిన విమానం

రియాద్:భారీ పేలుడుతో అల్లకల్లోలంగా మారిన లెబనాన్ రాజధాని బీరుట్  ప్రజలకు చేదోడుగా నిలిచింది సౌదీ ప్రభుత్వం. కింగ్ సల్మాన్ మనవతాదృక్ఫథం సహాయ కేంద్రం నుంచి బీరుట్  ప్రజలకు అవసరమైన సహాయ సామాగ్రితో తొలి విమానం లెబనాన్ కు బయల్దేరింది. భారీ పేలుడు బాధితులకు మానవీయకోణంలో ఆదుకోవటం కోసం అవసరమైన మెడిసిన్, అహారాన్ని సౌదీ ప్రభుత్వం సాయంగా అందిస్తోంది. గత మంగళవారం బీరుట్ పోర్టులో భారీ పేలుడు సంభవించటంతో దాదాపు 135కి మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 4 వేల మందికిపై గాయపడ్డారు. కొందరు ఇళ్లు నేలమట్టమై రోడ్డునపడ్డారు. ఈ పరిస్థితుల్లో బాధితులకు చేదోడుగా నిలవాలని భావించిన సౌదీ ప్రభుత్వం దాదాపు 120 టన్నుల మెడిసిన్స్, వైద్య పరికరాలు, అత్యవసరంగా ఉపయోగపడే సామాగ్రి, అహారం, టెంట్లు, షెల్టర్ కిట్స్ విమానాల ద్వారా తరలిస్తోంది. వీటిని బాధితులకు అందించేందుకు ప్రత్యేకంగా ఓ టీంను ఏర్పాటు చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com