రాష్ట్రంలో 5 ల‌క్ష‌ల వీధి వ్యాపారుల‌కు అండ‌గా నిలిచేందుకు ల‌క్ష్యంగా పెట్టుకున్న ప్ర‌భుత్వం

- August 07, 2020 , by Maagulf
రాష్ట్రంలో 5 ల‌క్ష‌ల వీధి వ్యాపారుల‌కు అండ‌గా నిలిచేందుకు ల‌క్ష్యంగా పెట్టుకున్న ప్ర‌భుత్వం

హైద‌రాబాద్: లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఇబ్బందులు ప‌డుతున్న వీధి వ్యాపారుల‌కు ఆర్థికంగా అండ‌గా నిలిచేందుకు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్ల‌లో వీధి వ్యాపారుల‌ను గుర్తించి న‌మోదు చేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా 5 ల‌క్ష‌ల మంది వీధి వ్యాపారుల‌ను గుర్తించి ప్ర‌తి ఒక్క‌రికి బ్యాంకుల ద్వారా త‌క్కువ వ‌డ్డీతో రూ. 10 వేల చొప్పున రుణం మంజూరు చేయించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు తెలిపారు. అందులో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల 16 వేల  మంది వీధి వ్యాపారుల‌ను న‌మోదు చేసిన‌ట్లు తెలిపారు. ఈ ప్ర‌క్రియ‌ను త్వ‌ర‌గా పూర్తిచేసేందుకు మున్సిపాలిటీల‌లోని అన్ని విభాగాల‌ను, ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను,అదనపు కలెక్టర్లు,  క‌మిష‌న‌ర్ల‌ను స‌ర్వే కార్య‌క్ర‌మంలో నిమ‌గ్నం చేయ‌నున్న‌ట్లు తెలిపారు. గురువారం సాయంత్రం పుర‌పాల‌క శాఖ ప్ర‌న్సిప‌ల్ సెక్ర‌ట‌రి అర్వింద్ కుమార్‌, జిహెచ్‌ఎంసి డి.ఎస్‌.లోకేష్ కుమార్‌, మెప్మా ఎం.డి డా. స‌త్య‌నారాయ‌ణ‌,జోనల్ కమీషనర్ ప్రావీణ్య, అదనపు కమీషనర్ శంకరయ్య, పి డి సౌజన్య   లతో క‌లిసి నగరంలోని  మెహిదీప‌ట్నం రైతు బ‌జార్‌, దాని ప‌రిస‌ర ప్రాంతాల‌ను సంద‌ర్శించి వివిధ ర‌కాల నిత్యావ‌స‌రాల‌ను విక్రయిస్తున్న వీధి వ్యాపారుల‌తో సి.ఎస్‌ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ వీధి వ్యాపారుల‌ను గుర్తించి ప్ర‌త్యేక యాప్ ద్వారా న‌మోదు చేసి గుర్తింపు కార్డులు జారీచేస్తున్న‌ట్లు తెలిపారు. ఒక సారి న‌మోదు అయితే ప్ర‌భుత్వం ద్వారా ప్రోత్స‌హ‌కాలు పొందే అవ‌కాశం క‌లుగుతుంద‌ని తెలిపారు. న‌మోదుకు ఆధార్ కార్డు వివ‌రాల‌ను కూడా అంద‌జేయాల‌ని తెలిపారు. ఈ అవ‌కాశాన్ని వినియోగించుకొని ప్ర‌భుత్వం క‌ల్పించే ప్ర‌యోజ‌నాల‌ను పొందేందుకు రాష్ట్రంలోని వీధి వ్యాపారులు త‌మ వివ‌రాల‌ను సర్వే కు వచ్చిన  మున్సిప‌ల్ అధికారుల‌కు అంద‌జేయాల‌ని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com