లెబనాన్ పేలుడు బాధితులకు చేదోడుగా నిలిచిన బహ్రెయిన్

లెబనాన్ పేలుడు బాధితులకు చేదోడుగా నిలిచిన బహ్రెయిన్

మనామా:లెబనాన్ రాజధాని బీరుత్ ప్రజలకు గల్ఫ్ దేశాలు తోడుగా నిలబడ్డాయి. భారీ పేలుడుతో తీవ్ర భయోత్పాత తరుణంలో వారికి తగిన సాయం అందిస్తూ మానవీయతను చాటుకుంటున్నాయి. సౌదీ నుంచి లెబనాన్ కు నిత్యావసరాలు, ఔషధ సామాగ్రితో విమానం బయల్దేరగా..ఇటు బహ్రెయిన్ కూడా బీరుత్ ప్రజలకు అవసరమైన సామాగ్రిని తరలించింది. అహారం, మెడిసిన్ తో పాటు భారీ పేలుడతో సర్వం కొల్పోయిన ప్రజలకు అవసరమైన సహాయకసామాగ్రిని ప్రత్యేక విమానంలో పంపించింది. ది రాయల్ హ్యూమనైటేరియన్ ఫౌండేషన్ అధికారులు ఈ సహాయక సామాగ్రి తరలింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. 

 

Back to Top