ఏపీలో మరోసారి పదివేలకు పైగా కరోనా కేసులు

ఏపీలో మరోసారి పదివేలకు పైగా కరోనా కేసులు

అమరావతి:ఏ.పీలో గడిచిన 24 గంటల్లో 62,938 శాంపిల్స్ ను పరీక్షించగా 10,171 మంది కోవిడ్‌-19 పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది.దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,06,960 కు చేరింది. తాజా పరీక్షల్లో 29,154 ట్రూనాట్‌ పద్ధతిలో, 33,784 ర్యాపిడ్‌ టెస్టింగ్‌ పద్ధతిలో చేశారు. కొత్తగా 7,594 మంది వైరస్‌ బాధితులు కోలుకుని శుక్రవారం డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,20,464 కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 84,654 యాక్టివ్‌ కేసులున్నాయి. వైరస్‌ బాధితుల్లో తాజాగా 89 మంది మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 1842  కు చేరింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 23,62,270 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వెల్లడించింది.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)

Back to Top