దుబాయ్ నుంచి కోజికోడ్ వెళ్లిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి ప్రమాదం

దుబాయ్ నుంచి కోజికోడ్ వెళ్లిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి ప్రమాదం

కేరళ:దుబాయ్ నుంచి కోజికోడ్ వెళ్లిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి ప్రమాదం కోజికోడ్ ఎయిర్‌పోర్ట్‌లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది.దుబాయ్ నుంచి కోజికోడ్‌కు వచ్చిన ప్రయాణీకుల ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం(IX 1344)...కోజికోడ్‌లోని కరిపూర్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమాన కెప్టెన్, 14మంది  ప్రయాణీకులు దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. మరో 123 మంది గాయపడినట్లు సమాచారం.రాత్రి 7.41 గం.లకు విమానం ల్యాండ్ అయ్యే సమయంలో అక్కడ భారీ వర్షం కురుస్తోంది. రన్‌వేపై వర్షపు నీరు కారణంగా విమానం స్కిడ్ అయినట్లు తెలుస్తోంది. దుబాయ్ నుంచి కోజికోడ్ వస్తున్న విమానంలో 174 మంది ప్రయాణీకులు, 10 మంది శిశువులు, ఐదుగురు సిబ్బంది, ఇద్దరు పైలట్లు ఉన్నారు. కూలిన వెంటనే విమానం రెండు తునకలయ్యింది. అయితే అందులో మంటలు చెలరేగలేదు. పలువురు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స కల్పిస్తున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.

Back to Top