లాస్ట్ రైడ్ సేవలు ప్రారంభించిన సీపీ మహేశ్ భగవత్
- August 09, 2020
హైదరాబాద్:కోవిడ్-19 పేరు వింటనే 100 అడుగుల దూరం పరిగెత్తే పరిస్థితి. కానీ.. వైరస్ బారిన పడి మృతిచెందిన వారి అంత్యక్రియలు గౌరవ ప్రదంగా నిర్వహించేందుకు ఫీడ్ ద నీడ్ సంస్థ ముందుకు వచ్చింది. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన లాస్ట్ రైడ్ వాహనాన్ని సీపీ మహేశ్ భగవత్ శనివారం ప్రారంభించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సేవలు వినియోగించుకోవచ్చని.. 7995404040, 9490617234 మొబైల్ నంబర్లలో సంప్రదించాలని ఈ సందర్భంగా కమీషనర్ తెలిపారు. ఈ వాహనంలో మృతదేహలను తరలించేందుకు అవసరమయ్యే 25 కిట్లను ఓ IT సంస్థ సమకూర్చింది. లాస్ట్‌రైడ్ సేవల రూపకల్పనలో కీలకంగా వ్యవహరిస్తున్న 10 మంది సంస్థ ప్రతినిధులను కమీషనర్ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యురిటీ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి కృష్ణ ఏదుల, రాచకొండ సైబర్ సెక్యురిటీ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి సతీశ్, రాచకొండ అడ్మిన్ అదనపు డీసీపీ శిల్పవల్లి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!