`సర్కారు వారి పాట` మోషన్ పోస్టర్ కి ట్రెమండస్ రెస్పాన్స్
- August 09, 2020_1596959703.jpg)
సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మహేశ్‌బాబు 27వ సినిమా 'సర్కారు వారి పాట` టైటిల్ ప్రకటిస్తూ ఆ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అభిమానులను మెస్మరైజ్ చేసిన విషయం తెలిసిందే.. ఆగస్ట్ 9 సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా మహేష్ అభిమానులను హుషారెత్తించే `సర్కారు వారి పాట' మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి సూపర్ స్టార్ మహేశ్ బాబుకి బర్త్‌డే విషెస్ తెలిపారు నిర్మాతలు.
స్టైలిష్‌గా మెడ మీద వన్ రూపీ కాయిన్ టాటూతో ఇయర్ రింగ్ పెట్టుకుని ప్రీ లుక్‌లో కనిపించిన మహేశ్.. ఇప్పుడు మోషన్ పోస్టర్‌లో ఆ కాయిన్ టాస్ చేస్తూ కనిపించారు. సర్కారు వారి పాట అంటూ బ్యాక్ గ్రౌండ్‌లో థమన్ మ్యూజిక్ సూపర్ స్టార్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు పరశురామ్ దర్శకత్వంలో ఈ ప్రెస్టీజియస్ మూవీను నిర్మిస్తున్నాయి.
ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు మాట్లాడుతూ - `` నా బర్త్‌డే సందర్భంగా విషెస్ తెలుపుతున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అభిమానులు ఆశిస్తున్న అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. `సర్కారు వారి పాట’ స్ట్రాంగ్ మెసేజ్‌తో కూడిన ఒక కంప్లీట్ ఎంటర్‌టైనర్`` అన్నారు.
దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ - " సూపర్ స్టార్ మహేశ్ గారిని డైరెక్ట్ చేయాలనే నా కల `సర్కారు వారి పాట` నెరవేరింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్‌ని విడుదలచేయడం ఆనందంగా ఉంది." అన్నారు
మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మాట్లాడుతూ - " సూపర్ స్టార్ మహేశ్ గారితో మళ్ళీ కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది." అన్నారు
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫి: మధి,
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్
సంగీతం: థమన్ ఎస్.ఎస్,
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట
రచన, దర్శకత్వం: పరశురామ్ పెట్ల.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?