కోజికోడ్ ప్రమాదంపై దిగ్భ్రాంతి..బాధితుల కుటుంబాలకు క్రికెటర్ల సానుభూతి
- August 09, 2020
న్యూ ఢిల్లీ:కోడికోడ్ విమాన ప్రమాదంపై పలువురు క్రికెటర్లు విచారం వ్యక్తం చేశారు. టీమిండియా జట్టు సభ్యులతో పాటు మాజీ ఆటగాళ్లు ఘటనపై స్పందిస్తూ..బాధితుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి వేడుకుంటూ ట్వీట్లు చేశారు. కోజికోడ్ ఎయిర్ పోర్ట్ లో ఎయిరిండియా విమాన ప్రమాదానికి గురై 18 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ..ప్రమాదం తనను ఎంతో బాధించిందని, బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఎయిరిండియా విమాన ప్రమాదం తనను షాక్ కు గురిచేసిందని, ప్రయాణికులు, విమాన సిబ్బంది తరపున దేవుణ్ణి ప్రార్ధిస్తున్నట్లు రోహిత్ శర్మ ట్వీట్ చేశారు. ఇక మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ కోజికోడ్ దుర్ఘటనలో ఆత్మీయులను కొల్పోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రయాణికుల సురక్షిత ప్రయాణాన్ని కోరుకుంటూ దేవుణ్ణి ప్రార్ధిస్తున్నట్లు ట్వీట్ చేశారు. మరో మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా ఘటనపై ట్వీట్ చేశారు. 2020 ప్రజల పట్ల కొద్దిగా దయ చూపించాలని వేడుకుంటూ ట్వీట్ చేశారతను. అలాగే రవిశాస్త్రీ, రవిచంద్రన్ అశ్విన్, ఇర్ఫాన్ పఠాన్, మొహమ్మద్ కైఫ్ కోజికోడ్ విమాన ప్రమాదంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







