తెలంగాణ జాగృతి ఖతర్ హ్యండ్లూమ్ చాలెంజ్
- August 09, 2020
దోహా:జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా, స్వదేశీ చేనేత పరిశ్రమలకు కు అండగా నిలవాలన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆశయాల మేరకు, ఆగస్ట్ 7న తెలంగాణ జాగృతి ఖతర్ శాఖ ఆధ్వర్యంలో హ్యండ్లూమ్ చాలెంజ్ ప్రారంభించారు.
తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని తెలిపిన వివరాల ప్రకారం, తెలంగాణ చేనేత స్రుజానాత్మకను, ఘన చరిత్ర కు దేశవిదేశాల్లో అవగాహ, ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశ్యం తో ఈ ఛాలెంజ్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. ఆగష్టు 7 నుండి 10 వరకు జరిగే హ్యండ్లూమ్ చాలెంజ్ విశేష స్పందన వచ్చిందని ఖతర్ తో పాటు యూకే, న్యూజిలాండ్, కువైట్ వంటి దేశాల నుండే కాకుండా భారత్ లో సైతం కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి పలువురు అతివలు చాలెంజ్ ను స్వీకరించి విజయవంతం చేసారని తెలిపారు.ఈ చాలెంజ్ లో పాల్గొన్న ఉత్తమ 10 మంది విజేతలకు సిరిసిల్ల చేనేత చీరలను బహుమతి గా ఇవ్వనున్నట్లు తెలిపారు.
అదే సమయంలో చేనేతకు చేయూత ఇవ్యడానికి , భారత దేశానికే తలమానికంగా , తమ కళా సంపదను, నైపుణ్యాలతో ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన నేతన్నల కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్డర్లు ఇవ్యనున్నట్లు తెలిపారు.అందులో భాగంగా ఈరోజు అగ్గి పెట్టె లో, చేతి వేలి ఉంగరం లో ఇమిడే చీరలను తయారు చేసిన సిరుల ఖిల్లా సిరిసిల్ల కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత చేనేత శిల్పి నల్ల పరంధాములు గారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని తన దైన నైపుణ్యం తో చేనేత వస్త్రాల తయారీని కొత్త పుంతలు తొక్కిస్తున్న వారి కుమారులు నల్ల విజయ్ ని తెలంగాణ జాగృతి ఖతర్ ఆధ్వర్యంలో ప్రతినిధి ఎల్లయ్య తాళ్లపెళ్లి గారు సన్మానించి చేనేత వస్త్రాల ఎగుమతి కి ఆర్డర్ ఇవ్యడం జరిగింది.
ఈ సంధర్భంగా నందిని గారు మాట్లాడుతూ ఇతర దేశాల వస్తువులను వినియోగాన్ని సాధ్యమైన రీతిలో తగ్గించి మన సాంస్కృతి, వైభవాన్ని , కళాత్మక ను ప్రోత్సాహిస్తూ మన దేశపు వస్తువులు వాడితే గ్రామీణ ప్రాంతాల్లో చాలామందికి ఉపాధి దొరుకుతుందని వారి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?