గంటకు 278 కిలోమీటర్ల వేగంతో పట్టుబడ్డ వాహనదారుడు
- August 10, 2020
షార్జా: షార్జాలోని ఓ ట్రాఫిక్ రాడార్, 278 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోన్న మోటరిస్టుని గుర్తించింది. ట్రాఫిక్ అవేర్నెస్ అండ్ ట్రాఫిక్ మీడియా బ్రాంచ్ డైరెక్టర్ కెప్టెన్ సౌద్ అల్ షైబా మాట్లాడుతూ, ఈ ఏడాదిలో ఇప్పటిదాకా ట్రాఫిక్ రాడార్ గుర్తించిన అత్యధిక వేగం ఇదేనని చెప్పారు. నజ్వా - మలీహా రోడ్డుపై వాహనదారుడు ఈ వేగంతో దూసుకెళ్ళినట్లు ఆయన వివరించారు. సదరు వాహనదారుడికి సమన్లు జారీ చేశారు. గల్ఫ్ దేశానికి చెందిన వ్యక్తిగా అతన్ని గుర్తించారు. అతని వాహనాన్ని ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. అతి వేగం తమ ప్రాణాలతోపాటు, ఇతరుల ప్రాణాలకూ ముప్పు తెస్తుందని వాహనదారులు గుర్తించాలని కెప్టెన్ అల్ షైబా చెప్పారు. ఇతరుల్ని ప్రమాదంలోకి నెట్టేలా వ్యవహరిస్తే వాహనదారులపై డబుల్ పెనాల్టీస్ విధించడం జరుగుతుందని అన్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు