ఇండియాకి విమానాల పునఃప్రారంభంపై అల్‌ తాయెర్‌ గ్రూప్‌ ప్రకటన

- August 10, 2020 , by Maagulf
ఇండియాకి విమానాల పునఃప్రారంభంపై అల్‌ తాయెర్‌ గ్రూప్‌ ప్రకటన

కువైట్: అల్‌ తాయెర్‌ గ్రూప్‌ మరియు లగ్జరీ ట్రావెల్స్‌, ఇండియాకి విమానాల్ని పునఃప్రారంభించే విషయమై ప్రకటన చేయడం జరిగింది. ఆగస్ట్‌ 11 నుంచి విమానాల పునరుద్ధరణ ప్రారంభమవుతుంది. ఈ విషయాన్ని గ్రూప్‌ సీఈఓ ఫహాద్‌ అల్‌ బాకర్‌ వెల్లడించారు. ఢిల్లీ, విజయవాడ, చెన్నయ్‌, ముంబై, హైద్రాబాద్‌ మరియు కొచ్చిన్‌లకు విమానాల్ని పునఃప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ గ్రూప్‌ నుంచి కువైట్‌ ఎయిర్‌వేస్‌ విమానాల్ని ఈ డెస్టినేషన్స్‌కి ఆఫర్‌ చేస్తున్నట్లు వివరించారు. ఇండియాకి వెళ్ళే ప్రయాణీకులకు పీసీఆర్‌ పరీక్షలు చేసే సౌకర్యాన్ని కూడా సమకూర్చుకుంది అల్‌ బాకెర్‌ గ్రూప్‌. ఢిల్లీ విమానాల లో ఇతర రాష్ట్రాలకు వెళ్లదలుచుకునేవారు సైతం ప్రయాణించవచ్చు. కాగా, విజయవాడ విమానం ఆంధ్రప్రదేశ్‌ ‌కి మాత్రమే పరిమితం. అలాగే చెన్నయ్ విమానం తమిళనాడు కు పరిమితం. హైద్రాబాద్ విమానం తెలంగాణ కు పరిమితం. కొచ్చిన్‌ విమానం మాత్రం కేరళతోపాటు తమిళనాడు కోసం కూడా వినియోగిస్తారు.

టికెట్ బుకింగ్ మరియు ఇతర వివరాల కోసం, ప్రజలు వీరిని సంప్రదించవచ్చు..

వసీమ్ - 99696767
యాసర్ - 67041981
సలీమ్ - 97122364
యూసఫ్ - 9667751 
అతుల్ - 9731335
బిలాల్ - 99557046
లినెట్ - 99691151

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com