దుబాయ్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపై కరోనా ఎఫెక్ట్..ఆన్ లైన్ లోనే వీక్షణ

- August 10, 2020 , by Maagulf
దుబాయ్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపై కరోనా ఎఫెక్ట్..ఆన్ లైన్ లోనే వీక్షణ

దుబాయ్: కరోనా నేపథ్యంలో దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ స్వాతంత్య్ర దినోత్సవ  వేడుకలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 15న దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ లో వేడుక జరుగుతుందని, కానీ, వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఇండియన్ కాన్సులేట్ లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కు ప్రవాసభారతీయులు, భారత శ్రేయోభిలాషులు ను రావద్దని కోరుతూ ప్రకటన విడుదల చేసింది. 

74వ భారత్ స్వాతంత్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ కాన్సుల్ జనరల్ డా.అమన్ పూరి, ఆగస్ట్ 15న ఉదయం 7:30కు జండా వందనం కావించి భారత రాష్ట్రపతి యొక్క సందేశాన్ని చదువుతారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు కాన్సులేట్ లో నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు కేవలం ఇండియన్ కాన్సులేట్ అధికారులు మాత్రమే హాజరవ్వనున్నారు. ప్రస్తుత కరోనా మహమ్మారి ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఈ వేడుకలకు అనుమతించబడరు, అయితే..ఆన్ లైన్ ద్వారా త్రివర్ణ పతాకావిష్కరణ, కార్యాలయం ప్రసంగాలను ప్రత్యక్షంగా వీక్షిండేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందని కాన్సులేట్ స్పష్టం చేసింది.

ఫెస్బుక్ లో వీక్షించేందుకు: @IndianConsulate.Dubai
ట్విట్టర్ లో వీక్షించేందుకు: @cgidubai

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com