కూటీ కోసం...కూలి కోసం దేశం విడిచిన బడుగు జీవికి ఎంత కష్టం ??
- February 06, 2016
జీవనం కోసం దేశం విడిచి...కుటుంబాలను వదలి వచ్చిన పేద కార్మికులు దుబాయ్ లో దర్జాగా ఉన్నారని అందరూ
భావిస్తారు. వీరు ఎంతో ప్రమాదకరమైన వృత్తులు చేస్తున్నారనే సంగతి ఎక్కడో ఉన్నవారి కుటుంబసభ్యులకు ఏ మాత్రం తెలియదు...తాము మైనం మాదిరిగా కరిగిపోతూ తమ వళ్ళు చల్లగా సుఖంగా ఉండాలని వీరు నిత్యం భగవంతుడ్ని కోరుకుంటారు. ఎంతో హృదయవిధారకరమైన వీరి జీవనశైలి గూర్చితెలుసుకొనేందుకు " మా గల్ఫ్ డాట్ కామ్ " వారిని ఎలా ఉన్నారని పలకరించింది. బంగ్లాదేశ్ కు చెందిన అలీ హుస్సిన్ (35) ఎత్తైన భవనాలపై కిటికీలను శుబ్రం చేసే కార్మికుడు జవాబిస్తూ , ప్రస్తుతం తాను 40 అంతస్థుల భవనంను శుబ్రం చేసానని...ఇందుకు 30 రోజుల సమయం పట్టిందని, అలాగే మరో 14 అంతస్థుల భవనం పని ఉందని..ఆ పనిని 10 - 12 రోజుల వ్యవధిలో పూర్తి చేస్తానని చెక్కుచెదరని ఆత్మ విశ్వాసంతో జవాబు ఇచ్చాడు. గత 7 ఏళ్ళుగా దుబాయ్ లో ఇదే వృత్తిలో కొనసాగుతున్నట్లు తెలిపాడు. బాగా ఎత్తైన భవనాల పై గాల్లో వేలాడుతూ పని చేయాల్సిందేనని, ఒకసారి పట్టు జారితే...తమ శరీర భాగాలు చిద్రమై అనవాళ్ళుకు సైతం దొరకవని పేర్కొన్నాడు. ఎత్తైన కిటికీల మీద నిలబడి పని చేస్తుంటే.., భయం కలగదా అని అలీని అడిగితే, తనకు అటువంటి భయాలు ఉండవని బదులిచ్చాడు. మీరు చేస్తున్న ఈ ప్రమాదకరమైన కష్టం గూర్చి మీ కుటుంబ సభ్య్హులకు తెలుసా అని అడిగితే, తనని వెంటనే వచ్చేయమని గగ్గోలు పెడతారని అలీ నవ్వుతూ చెప్పాడు. అతని సహావృత్తి కార్మికుడు నేపాల్ కు చెందిన జోగ్గ్రం చౌదరి మాట్లాడుతూ , తన భార్యకు తాను చేస్తున్న పని గూర్చి ఏ మాత్రం తెలియదని...ఇలా ఎత్తుగా ఉన్న భవనాల అంచులపై గాల్లో వేలాడుతూ పని చేయడం అని చెబితే , ఎంతో భయపడి ..తనను వెంటనే ఇంటికీ రమ్మని సతాయిస్తుందని పెద్దగా నవ్వుతూ చెప్పాడు. దుబాయ్ అంటే మీకు ఇష్టమా ? అని ప్రశ్నిస్తే...అవును చాలా ఇష్టమని కళ్ళు కిందకు దించి..రాలి పడే కన్నీటి బిందువులను దాచే యత్నం చేశాడు అలీ.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







