తెలంగాణలో కొత్తగా 1,896 కరోనా కేసులు
- August 11, 2020
హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 1,896 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది.దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడ్డవారి సంఖ్య 82,647కు చేరింది. తాజాగా 8 మంది కరోనాతో మృతి చెందగా.. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 645కి పెరిగింది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 22,628 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు 59,374 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. అయితే తెలంగాణలో కరోనా రికవరీ రేటు 71.84 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 6,42,875 నమూనాలు పరీక్షించినట్లు వివరించింది. అయితే సోమవారం అత్యధికంగా GHMC పరిధిలోనే 338 కేసులు నమోదుకాగా.. రంగారెడ్డి జిల్లాలో 147, కరీంనగర్ జిల్లాలో 121, మేడ్చల్ జిల్లాలో 119 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి..
--హరి(మాగల్ఫ్ ప్రతినిథి,తెలంగాణ)

తాజా వార్తలు
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!







