అమెరికాలో కాల్పుల కలకలం..20 మంది మృతి
- August 11, 2020
వాషింగ్టన్:అమెరికాలో కాల్పులు కలకలం రేపింది. వాషింగ్టన్‌లోని ఓ పార్టీలో జరిగిన గొడవ కాల్పులుకు దారి తీసింది. ఈ ఘటనలో 20మంది మృతి చెందగా.. ఒక పోలీస్‌కి తీవ్రగాయాలయ్యాయి. ఈ విషయంపై మాట్లాడిన ఓ పోలీస్ అధికారి.. ఈ గొడవ అర్ధరాత్రి 12.30గం.లకు జరిగింది తెలిపారు. మృతుల్లో 11 మంది మహిళలు ఉన్నారని అన్నారు. కనీషం ముగ్గురు కాల్పులుకు దిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, రాత్రి జరిగిన ఈ పార్టీకి సుమారు 400 మంది హాజరయ్యారని అన్నారు. కరోనా నేపథ్యంలో 50మందికి మించి ఒక ప్రదేశంలో ఉండకూడదనే నిబంధనలు ఉన్నా.. ఇంత పెద్దగా పార్టీ నిర్వహించడం అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు చేయగా.. మరోవైపు కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు పార్టీ నిర్వాహుకులపై కూడా కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్‌ప్రెస్‌వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్‌కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్‌ఫామ్‌కు నష్టం: కువైట్







