గూగుల్‌లో కొత్త ఫీచర్..
- August 11, 2020
సాఫ్ట్వేర్ సంస్థ గూగుల్ తన యూజర్ల కోసం ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ సెర్చ్‌లో ప్రస్తుతం యూజర్లు పీపుల్ కార్డ్స్ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. దీని సహాయంతో యూజర్లు తమ వర్చువల్ విజిటింగ్ కార్డును క్రియేట్ చేసుకోవచ్చు. దీని వల్ల ఇంటర్నెట్ ప్రపంచంలో మీ గురించి ఇతరులకు తెలుస్తుంది. మీరు వ్యాపారవేత్త అయితే మీ వ్యాపారం గురించి ఇతరులకు తెలపవచ్చు. అదే ఫ్రీలాన్సర్ అయితే మిమ్మల్ని పనికోసం ఇతరులు సంప్రదిస్తారు. ఇలా గూగుల్ వర్చువల్ విజిటింగ్ కార్డ్స్ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.
గూగుల్‌లో వర్చువల్ విజిటింగ్ కార్డ్‌ను క్రియేట్ చేయడం ఇలా…
1. యూజర్లు ముందుగా తమ గూగుల్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి.
2. సెర్చ్‌లో పేరు వెదకాలి. లేదా యాడ్ మి టు సెర్చ్ అనే ప్రాంప్ట్ రాగానే ట్యాప్ చేయాలి.
3. కార్డును క్రియేట్ చేసేందుకు గూగుల్ అకౌంట్లో ఉన్న పేరును ఎంపిక చేసుకోవచ్చు. లేదా వేరే ఏదైనా పేరు యాడ్ చేయవచ్చు. అలాగే మీ గురించిన డిస్క్రిప్షన్, వెబ్సైట్ లింకులు, సోషల్ మీడియా ప్రొఫైల్స్, ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ తదితర వివరాలను ఎంటర్ చేయవచ్చు.
4. అనంతరం ఏదైనా ఫోన్ నంబర్‌తో ఆథెంటికేషన్ ఇవ్వాలి. దీంతో వర్చువల్ విజిటింగ్ కార్డు క్రియేట్ అవుతుంది.
గూగుల్‌లో ఎవరైనా ఎవరి పేరునైనా వెదికినప్పుడు వాటిల్లో అలా క్రియేట్ చేసుకున్న వర్చువల్ విజిటింగ్ కార్డుల్లో ఉన్న పేర్లు కనిపిస్తాయి. ఒకటికన్నా ఎక్కువ మందికి ఒకే పేరు ఉంటే వారి వివరాలన్నీ సెర్చ్‌లో జాబితా రూపంలో కనిపిస్తాయి. దీంతో కావల్సిన వారిని ఎంచుకుని కాంటాక్ట్ చేయవచ్చు. దీని వల్ల స్వయం ఉపాధి పొందేవారు, వ్యాపారవేత్తలు, ఫ్రీలాన్సర్స్, ఇతర ఉద్యోగులు, ప్రొఫెషనల్స్‌కు ఎంతగానో ఉపయోగం ఉంటుంది.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







