తెలంగాణ:జాతీయ విద్యా విధానంపై గవర్నర్ వెబినార్
- August 12, 2020
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ గురువారం రోజు “నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసి-2020” పై వెబినార్ నిర్వహించనున్నారు.“పర్ స్పెక్టివ్ ఎబౌట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసి-2020 అండ్ రోడ్ మ్యాప్ ఫర్ తెలంగాణ” అన్న అంశంపై విద్యారంగ ప్రముఖులతో గవర్నర్ వెబినార్ నిర్వహిస్తారు.
గురువారం ఉదయం 11.30 గం.లకు ప్రారంభమయ్యే ఈ వెబినార్ లో యూజీసీ సభ్యులు, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటి వైస్-ఛాన్సలర్ ప్రొ.ఈ.సురేష్ కుమార్ భాషలు, నైపుణ్యాలు, ఉద్యోగిత అన్న అంశంపై ప్రసంగిస్తారు.
సెంటర్ ఫర్ ఎరనామిక్ అండ్ సోషల్ స్టడీస్ డైరెక్టర్ ప్రొ.ఈ.రేవతి ‘స్కూల్ ఎడ్యుకేషన్, సోషన్ సైన్సెస్’ అన్న అంశంపై ప్రసంగిస్తారు.ఉన్నత విద్యా మండలి వైస్-ఛైర్మన్ ప్రొ.వెంకట రమణ మేనేజ్ మెంట్, టెక్నాలజి, నైపుణ్యాల అభివృద్ధిపై ఉపన్యసిస్తారు.యూజీసీ సభ్యులు ప్రొ. శివరాజ్ సైన్స్ సబ్జెక్టులపై మాట్లాడతారు.నల్సార్ రిజిస్ట్రార్ ప్రొ.వి.బాలకిస్టారెడ్డి విధానపరమైన అంశాలు, లీగల్ స్టడీస్ పై అభిప్రాయాలు పంచుకుంటారు.అన్నా యునివర్సిటి మాజీ వైస్-ఛాన్సలర్ ప్రొ. ఈ. బాలా గురుస్వామి విద్యావిధానంలో సంస్కరణలపై మాట్లాడుతారు.ఈ నూతన జాతీయ విద్యా విధానం ద్వారా దేశ విద్యావ్యవస్థలో, తెలంగాణ రాష్ట్ర విద్యావ్యవస్థలో రాబోయే సమూల మార్పులను ఈ వెబినార్ ద్వారా చర్చించి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!