10 లక్షల మంది మెడికోలకు ఉచితంగా శిక్షణ అందించనున్న యూఏఈ

- August 13, 2020 , by Maagulf
10 లక్షల మంది మెడికోలకు ఉచితంగా శిక్షణ అందించనున్న యూఏఈ

భారీ ప్రాజెక్టులు, అబ్బురపరిచే కట్టడాలతో ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసిన యూఏఈ ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యరంగంలో ఏకంగా పది లక్షల మందికి ఉచితంగా శిక్షణ ఇప్పించనుంది. 'వాటర్ ఫాల్స్' పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. వైద్యరంగంలోని డాక్టర్లు, నర్సులు, సాంకేతిక నిపుణులు, ఫిజిషియన్స్, ఫార్మసీ, ఆస్పత్రి నిర్వహణ సిబ్బంది, మనవతా రంగాలకు సంబంధించి సిబ్బందికి అంతర్జాతీయ స్థాయిలో ఉచితంగా శిక్షణ ఇప్పించనున్నట్లు యూఏఈ ఉపాధ్యక్షుడు, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ వెల్లడించారు. అంతర్జాతీయంగా వైద్యరంగానికి దోహదపడేందుకు, సోదరభావాన్ని పెంపొందించే దిశలో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ శిక్షణ కార్యక్రమం 'వాటర్ ఫాల్స్' నిరంతరాయంగా కొనసాగుతుందని కూడా ఆయన తెలిపారు. వైద్యరంగంలోని 14 విభాగాల్లోని సిబ్బందికి అంతర్జాతీయ స్థాయిలోని 140 మంది సైంటిస్టులు, వైద్యరంగ నిపుణులతో ఆన్ లైన్ ద్వారా శిక్షణ తరగతులు, ప్రసంగాలు, సెమినార్లు, వైద్యరంగంలోని సరికొత్త విధానాలపై అవగాహన కల్పించనున్నారు. 67 విద్యాసంస్థలు వాటర్ ఫాల్స్ లో భాగం కానున్నాయి. ఈ కార్యక్రమం మొత్తాన్ని ఉప ప్రధానమంత్రి, అంతర్గత మంత్రి లెఫ్టినెంట్ జనరల్ షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పర్యవేక్షిస్తారు. వాటర్ ఫాల్స్ ద్వారా శిక్షణ పొందిన వైద్య సిబ్బందికి అంతర్జాతీయ శాస్త్రీయ, విద్యాసంస్థల నుండి శిక్షణ పొందినవారు ధృవీకరణ పత్రం అందిస్తారు. దీంతో సిబ్బందికి ఉద్యోగ భద్రత మరింత పెరుగనుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com