అన్ని దశల్లోని విద్యార్ధుల రెండో రౌండ్ పరీక్షల షెడ్యూల్ విడుదల
- August 13, 2020
ఖతార్: ఖతార్ లోని అన్ని స్టేజిల్లోని (డే, అడల్ట్ ఎడ్యూకేషన్) విద్యార్ధులకు సంబంధించి ఖతార్ విద్యా, ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ రెండో రౌండ్ పరీక్షల షెడ్యూల్ ను ప్రకటించింది. ఆగస్ట్ 23 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయని తెలిపింది. సెకండ్ రౌండ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ కు సంబంధించిన వివరాలు ఈ లింక్
https://www.edu.gov.qa/Documents/ExamSchedules/ExamSchedules.pdf?csf=1&e=V1bfYBలో ఇవ్వబడ్డాయి. ఇదిలాఉంటే ఖతార్ పబ్లిక్ స్కూల్స్ లో అడ్మిషన్లు, ట్రాన్స్ ఫర్ కు సంబంధించి ఆగస్ట్ 23 నుంచి ఆక్టోబర్ 7లోగా ఎన్ రోల్మెంట్ చేసుకోవాలని ఇటీవలె ఖతార్ విద్యాశాఖ ప్రకటించిన విషయం తెలిసింది. మరోవైపు వచ్చే సెప్టెంబర్ లో బాలికల కోసం దేశంలోనే తొలి టెక్నికల్ హై స్కూల్ ను ప్రారంభించనున్నట్లు ఖతార్ ప్రకటించింది. 90 మంది విద్యార్ధులతో ఈ తొలి టెక్నికల్ హై స్కూల్ ప్రారంభం కానుంది. సాంకేతిక విద్య అభ్యసించటం ద్వారా ఖతార్ డెవలప్మెంట్ లో మహిళలకు తగిన ప్రధాన్యం దక్కుతుందిని విద్యాశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







